Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే ఇంతమంది నన్ను అభిమానించారు: కౌశల్

  • నా అంతట నేనుగా గొడవలు పడలేదు 
  • ఇంటిసభ్యుల మైండ్ సెట్ ను అర్థం చేసుకున్నాను 
  • నేను గెలుస్తాననే నమ్మకం నాకు వచ్చింది
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా కౌశల్ గురించి .. కౌశల్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటున్నారు. కౌశల్ ను ఎందుకు ఇంతమంది ఇంతగా అభిమానిస్తున్నారు? అనే విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఈ విషయాన్ని గురించి కౌశల్ స్పందించాడు.

 "బిగ్ బాస్ హౌస్ లో నా క్రమశిక్షణ .. పట్టుదల .. సహనం .. గేమ్ లో గెలవాలనే కసి .. ఆ విషయంలో నేను చూపిన ఏకాగ్రతను ప్రేక్షకులంతా చూశారు. నాలోని ఈ లక్షణాలన్నింటికీ ప్రజలు కనెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో 113 రోజుల జర్నీలో మిగతావాళ్లు నన్ను ఏమీ అనకుండా .. నేను వాళ్లను ఏమీ అనలేదు. ఎవరైనా ఏదైనా అంటే ఎదురుగా సమాధానమిచ్చానే గానీ .. అంతకి మించి నేను ఏమీ అనలేదు. ఇంటి సభ్యుల మైండ్ సెట్ ను అర్థం చేసుకుంటూ వెళ్లాను. ఎవరు గేమ్ ఆడటానికి వచ్చారు? అనే విషయంలో క్లారిటీ తెచ్చుకున్నాను. దాంతో ఈ షోలో నేను గెలుస్తాననే నమ్మకం నాకు 4వ వారంలోనే వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. 
kaushal

More Telugu News